MovieGQ

Sannaga Veeche Challa Galiki

Gundamma Katha (1962) · Track 3 of 8

Song Details

Lyrics

సన్నగ వీచే చల్ల గాలికి కనులు మూసినా కలలాయే తెల్లని వెన్నెల పానుపు పై ఆ కలలో వింతలు కననాయే సన్నగ వీచే చల్ల గాలికి కనులు మూసినా కలలాయే తెల్లని వెన్నెల పానుపు పై ఆ కలలో వింతలు కననాయే అవి తలచిన ఏమో సిగ్గాయే కనులు తెరచిన నీవాయే నే కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే కలవరపడి నే కనులు తెరువ నా కంటి పాపలో నీవాయే ఎచట చూసినా నీవాయే కనులు తెరచిన నీవాయే నే కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే మేలుకొనిన నా మదిలో యేవొ మెల్లని పిలుపులు విననాయే మేలుకొనిన నా మదిలో యేవొ మెల్లని పిలుపులు విననాయే ఉలికిపాటుతో కలయ వెతక నా హృదయ ఫలకమున నీవాయే కనులు తెరచినా నీవాయే కనులు మూసినా నీవేనాయే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gundamma Katha

See All