MovieGQ

Prema Yatralaku Brindavanamu

Gundamma Katha (1962) · Track 7 of 8

Song Details

Lyrics

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునె ఊటీ శాయగా సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునె ఊటీ శాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ యేలనో కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ యేలనో అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gundamma Katha

See All