MovieGQ

Entha Hayi Ee Reyi

Gundamma Katha (1962) · Track 5 of 8

Song Details

Lyrics

ఎంత హాయి ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి చందమామ చల్లగా మత్తుమందు చల్లగా చందమామ చల్లగా పన్నీటిజల్లు చల్లగా ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి ఎంత హాయి ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా విరితావుల పరవడిలో విరహమతిశయింపగా విరితావుల ఘుమఘుమలో మేను పరవశింపగా ఎంత హాయి ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి ఎంత హాయి కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా కానరాని కోయిలలు మనకు జోలపాడగా మధురభావలాహిరిలో మనము తూలిపోవగా మధురభావలహరలో మనము తేలిపోవగా ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి చందమామ చల్లగా మత్తుమందు చల్లగా ఎంత హాయి - ఈరేయి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gundamma Katha

See All