MovieGQ

Lechindi Nidra Lechindi Mahila Lokam

Gundamma Katha (1962) · Track 2 of 8

Song Details

Lyrics

లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుషప్రపంచం లేచింది మహిళాలోకం ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మంగారు ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మంగారు ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా... ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా విస్సన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం పల్లెటూళ్ళలో పంచాయితీలు పట్టణాలలో ఉద్యోగాలు పల్లెటూళ్ళలో పంచాయితీలు పట్టణాలలో ఉద్యోగాలు అది యిది యేమని అన్ని రంగముల... అది యిది యేమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు నిరుద్యోగులను పెంచారు లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం చట్టసభలలో సీట్ల కోసం భర్తల తోనే పోటీ చేసి చట్టసభలలో సీట్ల కోసం భర్తల తోనే పోటీ చేసి డిల్లి సభలో పీఠం వేసి... డిల్లి సభలో పీఠం వేసి లెక్చర్ లెన్నో దంచారు విడాకు చట్టం తెచ్చారు లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుషప్రపంచం లేచింది, నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gundamma Katha

See All