MovieGQ

Oka Thotalo

Gangotri (2003) · Track 2 of 7

Song Details

Music Director
Lyricist

Lyrics

ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని... అలాగే నవ్వుతూ ఉండాలని నింగినేల వాగువంక చెట్టుచేమ గువ్వగూడు ఆశీర్వదించాలి లల లాలాల లల లాలాల లాలాల లాలాల ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది చరణం: 1 ఎన్నో రంగుల పువ్వు ఎండ కన్నే ఎరగని పువ్వు సుందరమైన పువ్వు పలు సుగుణాలున్న పువ్వు ఏ గుడిలో అడుగుపెట్టునో... దేవుడు చల్లగ చూడాలి... ఆ పువ్వుకు పూజలు చేయాలి... దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే... హాయిగ ఉండాలి లల లాలాల లల లాలాల లాలాల లాలాల ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది చరణం: 2 నీరును పోసి పెంచి పందిరల్లే నీడనిచ్చి ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి ఆ పువ్వుకి తోడు ఉండగా... దేవుడు వేరే లేడు కదా తోటమాలే పువ్వుకి దేవుడుగా మాలికి పువ్వుకు మధ్యన అనుబంధం... ఎన్నడు వాడదుగా ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని నింగినేల వాగువంక చెట్టుచేమ గువ్వగూడు ఆశీర్వదించాలి లల లాలాల లల లాలాల లాలాల లాలాల ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gangotri

See All