MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Gangotri (2003) Songs Jeevana Vahini Song

Jeevana Vahini

Song

Music Director

Lyrics

  • ఓం... ఓం... ఓం...
    జీవన వాహినీ... పావనీ...
    కలియుగమున కల్పతరువు నీడ నీవనీ
    కనులు తుడుచు కామధేను తోడు నీవని

    వరములిచ్చి భయము తీర్చి శుభము గూర్చు గంగాదేవి
    నిను కొలిచిన చాలునమ్మా సకల లోక పావని
    భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరిగు శుభగాత్రీ
    గంగోత్రి... గంగోత్రి...
    గంగోత్రి... గంగోత్రి...
    గల గల గల గంగోత్రి హిమగిరి జని హరి పుత్రి (5)

    జీవన వాహినీ... పావనీ...

    మంచుకొండలో ఒక కొండవాగులా
    ఇల జననమొందిన విరజా వాహినీ...
    సససరిసరి గరిగమగమ దప దప దప దప గరి సరి సరి సరి
    విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సుర గంగ నీవనీ
    సానిదగరిసనిదపమగరి సరి సరి గమ గమ గరిస
    అత్తింటికి సిరుల నొసగు అలకనందవై సగర కులము కాపాడిన భాగీరధీవై
    బదరీవన హృషికేశ హరిద్వార ప్రయాగముల మణి కర్ణిక
    తన లోపల వెలసిన శ్రీ వారణాసి గంగోత్రి... గంగోత్రి
    గంగోత్రి... గంగోత్రి....
    గల గల గల గంగోత్రి హిమగిరి జని హరిపుత్రి (5)
    పసుపు కుంకుమతో పాలు పన్నీటితో శ్రీగంధపు ధారతో పంచామృతాలతో
    అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ
    గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం
    అమ్మా... గంగమ్మా... కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని
    యమునకు చెప్పామ్మా సాయమునకు వెనకాడొద్దనీ
    గోదారికీ కావేరీకి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి
    నీ తోబుట్టువులందరికీ చెప్పమ్మా మా గంగమ్మా
    జీవ నదివిగా ఒక మోక్ష నిధివిగా పండ్లు పూలు పసుపులా పారాణి రాణిగా
    శివుని జటలనే తన నాట్య జతులుగా జలక మాడు సతులకు సౌభాగ్య దాత్రిగా
    గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా
    జలదీవెన తలకుపోసే జననీ గంగాభవాని
    ఆమె అండ మంచు కొండ వాడని సిగ పూదండ గంగోత్రి... గంగోత్రి
    గంగోత్రి... గంగోత్రి...
    గల గల గల గంగోత్రి హిమగిరి జని హరిపుత్రి (5)
    జీవన వాహినీ... పావనీ...

Jeevana Vahini Keyword Tags

  • Jeevana Vahini Song
  • Movie Gangotri Songs
  • Jeevana Vahini Song Music Director Composer
  • Details of Jeevana Vahini Song Wiki Information
  • Gangotri All Mp3 Songs
  • Lyrics for Jeevana Vahini Song
  • Jeevana Vahini Full Video Watch Online
  • Gangotri Movie Full Song
  • Jeevana Vahini Song from Gangotri Movie
  • Play Online Jeevana Vahini
  • Jeevana Vahini Song Vocal Singers
  • Music Director of Jeevana Vahini Songs
  • Jeevana Vahini Lyricists
  • Jeevana Vahini Movie Composer
  • Jeevana Vahini Videos from Gangotri Movie
  • Lyical Video of Jeevana Vahini
  • Jeevana Vahini Stream Online Music Links
  • Songs from GangotriMovie
  • Promo Videos of Jeevana Vahini
  • Jeevana Vahini English Lyrics