MovieGQ

Tholi Valapulalo Ye Chelikaina Alaka

Ganga Manga (1973) · Track 3 of 5

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను.. అది కవుల కల్పననుకున్నాను .. అది కవుల పైత్యమనుకున్నాను .. నీలో నాపై అలకను చూసి వలపు చేష్టలనుకున్నాను .. నీ చెలిమి కోరుతూ ఉన్నాను.. మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు.. ప్రతి మగువకిలాగే చెబుతారు.. ఆడది తానే చెంతకు వస్తే అలిగే పనులే చేస్తారు.. ఆ అలకే వలపనుకుంటారు .. చరణం: 1 కోరినవాణ్ని కొంగు ముడేసి తిప్పదలచుకుంటారు.. మరో మగువతో మాటాడగనే మూతి ముడుచుకుంటారు.. మొగము తిప్పుకుంటారు.. సేవ పేరుతో చేకిలి నొక్కి సరసం మాడుతుంటారు.. నిజం తెలిస్తే బుజం తడుముకొని నీతులు పలుకుతు ఉంటారు.. సాకులు చెబుతూ ఉంటారు తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను.. అది కవుల కల్పననుకున్నాను మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు.. ప్రతి మగువకిలాగే చెబుతారు.. చరణం: 2 ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు లోపల మమత పైన కలతతో సతమతమవుతూ ఉంటారు కుత కుత లాడుతూ ఉంటారు తేనెటీగలో ఉన్న గుణాలు మగవారలలో ఉంటాయి వీలు దొరికితే వారి తలపులు దారి తప్పుతూ ఉంటాయి పెడదారి పట్టుతూ ఉంటాయి... చరణం: 3 కలలోనైనా నా కన్నులలో వెలుగుతున్నది నీ రూపం నీ అందాలను ఆరాధిస్తూ పూజించడమే నా ధ్యేయం జీవించడమే నా గమ్యం కోరినవారు దూరమవుదురని గుబులుపడును నా మనసు నీ హృదయంలో నాపై ప్రేమ నిండుగ ఉందని తెలుసు అది పొంగుతున్నదని తెలుసు... ఆ..అహ..ఆ..అ..అహ..ఆ..ఆ ల.ల.లా..ఉ..ఊ..ఉ..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ganga Manga

See All