Song Details
Lyrics
పల్లవి: తాగాను... నేను తాగాను... బాగా నేను తాగాను..తాగాను భలే నిశాలో ఉన్నాను..ఉన్నాను..తాగాను..నేను తాగాను చరణం: 1 కైపులో ఉన్నాను కలలుకంటున్నాను మదిలోని వేదన మరువలేకున్నాను కైపులో వున్నాను కలలు కంటున్నాను మదిలోని వేదన మరువలేకున్నాను మ్మ్ హూ మ్మ్ హూ వలపులో పడ్డాను వెత తీర్చ వచ్చాను... వలపులో పడ్డాను నే నెవ్వరో నేనే చెప్పలేకున్నాను తాగాను... నేను తాగాను... బాగా నేను తాగాను.... తాగాను చరణం: 2 కోటి తారలు నిన్నే కోరుకుంటాయి అందాలు చందాలు అందజేస్తాయి కోటి తారలు నిన్నే కోరుకుంటాయి అందాలు చందాలు అందజేస్తాయి మ్మ్ హూ మ్మ్ హూ ఆ నెలరాజుతో చెలిమి నే కోరలేను నీ దారిలో నుండి తొలగిపోతాను మన్నించమన్నాను.... మరచిపొమ్మంటాను
Lyrics sourced from public databases. May contain errors.