Song Details
Lyrics
పల్లవి: గడసాని దొరసాని ఒడుపు చూడండి ఓ బాబు... ఒడుపు చూడండి మెరుపులాంటి చినదాని సొగసు చూడండి సొగసు చూడండి... అబ్బొ..దాని ఒడుపు చూడండి గడసాని... దొరసాని.. చరణం: 1 అరెరెరె నడకంటె నడక కాదు చలాకి నడక.. బల్ కిలాడి నడక నవ్వంటే నవ్వుగాదు తారాజువ్వ... అది వడిసెల రువ్వ ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా వగలంటే వగలు కాదు వలపుల సెగలు చూపంటే చూపు కాదు మదనుడి తూపు ఆ నడక... ఆ నవ్వు... ఆ వగలు... ఆ చూపు అన్ని కలిపి యిసిరితే గుమ్మైపోతారు తల దిమ్మైపోతారండి గడసాని..హేయ్..గడసాని దొరసాని ఒడుపు చూడండి... ఓ బాబు ఒడుపు చూడండి మెరుపులాంటి చినదాని సొగసు చూడండి సొగసు చూడండి... అబ్బొ... దాని ఒడుపు చూడండి గడసాని... దొరసాని.. చరణం: 2 మాటలతోటే నన్ను మురిపించకురా ఏమేమో పొగిడేసి బులిపించకురా మాటలతోటే నన్ను... మురిపించకురా ఏమేమో పొగిడేసి... బులిపించకురా ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా కవ్వించాలని నువ్వు కలలు కనకురా కత్తితోటి చెలగాడి చిత్తు గాకురా గడ ఎక్కి... తాడెక్కి... గంతేసి... చిందేసి అందరు మెచ్చేలాగా ఆడీ చూపాలిరా గడసాని..హేయ్..హేయ్..గడసాని దొరసాని ఒడుపు చూడండి ఓ బాబు ఒడుపు చూడండి మెరుపులాంటి చినదాని సొగసు చూడండి సొగసు చూడండి అబ్బొదాని ఒడుపు చూడండి గడసాని... దొరసాని... చరణం: 3 తళుకు బెళుకు చూపిస్తా.. గజ్జె ఘల్లుమనిపిస్తా.. తళుకు బెళుకు చూపిస్తే.... తటపట తటపటపట లాడాలి గజ్జె ఘల్లుమనిపిస్తే... గిలగిల గిలగిలగిల లాడాలి ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా తళుకు బెళుకు చూపిస్తే.... తటపట తటపటపట లాడాలి గజ్జె ఘల్లుమనిపిస్తే... గిలగిల గిలగిలగిల లాడాలి ఆ తళుకు... ఆ బెళుకు... ఆ బిగువు... ఆ బింకం అన్నికలిపి చూపితే ఐసై పోవాలండీ..పైసలు రాలాలండీ గడసాని..ఆహా..గడసాని దొరసాని ఒడుపు చూడండి ఓ..బాబు ఒడుపు చూడండి మెరుపులాంటి చినదాని సొగసు చూడండి సొగసు చూడండి అబ్బొ..దాని ఒడుపు చూడండి గడసాని... దొరసాని..
Lyrics sourced from public databases. May contain errors.