Song Details
Lyrics
పాడమని నన్నడుగతగునా పదుగురెదుటా పాడనా కృష్ణా ! పదుగురెదుటా పాడనా ! పాడమని నన్నడుగతగునా పదుగురెదుటా పాడనా కృష్ణా ! పదుగురెదుటా పాడనా ! పొదల మాటున పొంచి పొంచి ఎదను దోచిన వేణు గానము పొదల మాటున పొంచి పొంచి ఎదను దోచిన వేణు గానము ఒలక బోసిన రాగసుధకు మొలకలెత్తిన లలిత గీతి పాడమని నన్నడుగతగునా పదుగురెదుటా పాడనా చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోపకాంతలు చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోపకాంతలు మెచ్చలేరీ వెచ్చనీ హృదయాల పొంగెను మధురగీతి పాడమని నన్నడుగతగునా పదుగురెదుటా పాడనా ఎవరు లేనీ యమునాతటినీ ఎక్కడో ఏకాంతమందున ఎవరు లేనీ యమునాతటినీ ఎక్కడో ఏకాంతమందున నేను నీవై నీవు నేనై నేను నీవై నీవు నేనై పరవశించే ప్రణయ గీతి పాడమని నన్నడుగతగునా పదుగురెదుటా పాడనా కృష్ణా ! పదుగురెదుటా పాడనా !
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Doctor Chakravarty
See AllEe Mounam Ee Bidiyam
P. Susheela, Ghantasala
Paadamani Nannadaga Valena
P. Susheela
Nijam Cheppave Pilla
P. Susheela, B. Vasantha
O Ungarala Mungurula Raja
Madhavapeddi Satyam, P. Susheela
Manasuna Manasai Bratukuna Bratukai
Ghantasala
Neevu Leka Veena Palukalenannadi
P. Susheela
Ontiga Samayam Chikkindi
P.B. Srinivas, S. Janaki
Evaro Jwalanu Ragilincharu
Ghantasala
Neevu Leka Veena Palukalenannadi (Sad)
P. Susheela