MovieGQ

Manasuna Manasai Bratukuna Bratukai

Doctor Chakravarty (1964) · Track 6 of 10

Song Details

Lyrics

మనసున మనసై..బ్రతుకున బ్రతుకై మనసున మనసై..బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము.. మనసున మనసై..బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము.. ఆశలు తీరని ఆవేశములో..ఆశయాలలో..ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము.. అరె! ఎప్పుడొచ్చారు? మీకు తపోభంగము కలిగించామా? లేదు నా తపస్సుకి మెచ్చీ ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు. మరి ఆపేశావేం..పాడు. ఆది దంపతులే అడుగుతుంటే కాదనగలనా..మాధవీ దేవి గారు,మీకు అభ్యంతరం లేకుంటే కాదనకండి.బ్రతిమాలించుకోవాలా! ఊ.. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు..నీ కోసమే కన్నీరు నించుటకు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు..నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండినా అదే భాగ్యము..అదే స్వర్గము.. చెలిమియె కరువై..వలపే అరుదై చెదరిన హృదయమే శిలయైపోగా నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే తోడొకరుండినా అదే భాగ్యము..అదే స్వర్గము.. మనసున మనసై..బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Doctor Chakravarty

See All