MovieGQ

Poruginti Doragariki

Devadasu (1974) · Track 2 of 6

Song Details

Lyrics

పల్లవి: పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ ఇరుగింటి చినదానికి తగని మక్కువ ఇద్దరికీ.. ఇద్దరికీ కుదిరితే ఏమి తక్కువ ? చరణం: 1 ఈ మదికీ ఆ మదికీ అడ్డు గోడ లేదు ఈ ఇంటికి ఆ ఇంటికి అడ్డుగోడ వుంది ఈ మదికీ ఆ మదికీ అడ్డు గోడ లేదు ఈ ఇంటికి ఆ ఇంటికి అడ్డుగోడ వుంది గోడ నడుమ ఒక మూయని తలుపు ఉందిలే ఆ.. తలుపు వెనుక రా రమ్మను పిలుపు ఉందిలే పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ ఇరుగింటి చినదానికి తగని మక్కువ ఇద్దరికీ ఇద్దరికీ కుదిరితే ఏమి తక్కువ ? చరణం: 2 చదవేస్తే ఉన్నమతి జారిందేమో? మది నిండా వలపుంటే చదువు ఎందుకు చదవేస్తే ఉన్నమతి జారిందేమో? మది నిండా వలపుంటే చదువు ఎందుకు దొరవేషం వేసినా దుడుకుతనం పోదా.. ఏయ్ ఇంత ఎదిగినా నీలో పిరికితనం పోదా పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ.. ఇరుగింటి చినదానికి తగని మక్కువ ఇద్దరికీ ఇద్దరికీ కుదిరితే ఏమి తక్కువ ?

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devadasu

See All