Song Details
Lyrics
పల్లవి: జీవితం... ఏమిటి? వెలుతురూ... చీకటి.. అంతే జీవితం ఏమిటి... వెలుతురూ చీకటి అంతే వెలుతురంతా చీకటైతే... అందులోనే సుఖము ఉన్నది అవును.. జీవితం ఏమిటి... వెలుతురూ చీకటి చరణం: 1 మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ తునక తునకలో... నరకమున్నది మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ తునక తునకలో... నరకమున్నది లేదు లేదనుకున్న శాంతి చేదులోనే ఉన్నది ఈ చేదులోనే ఉన్నది... హా... హా... హా... జీవితం ఏమిటి... వెలుతురూ చీకటి చరణం: 2 రామచిలక ఎగిరిపోతే... రాగబంధం సడలిపోతే రామచిలక ఎగిరిపోతే... రాగబంధం సడలిపోతే మూగ హృదయం... గాయమైనది ఆ గాయమే ఒక గేయమైనది... ఆ గాయమే ఒక గేయమైనది... జీవితం ఏమిటి... వెలుతురూ చీకటి అంతే వెలుతురంతా చీకటైతే... అందులోనే సుఖము ఉన్నది జీవితం ఏమిటి... వెలుతురూ చీకటి వెలుతురూ.... చీకటి వెలుతురూ.... చీకటి
Lyrics sourced from public databases. May contain errors.