Satte E Godava Ledhu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- సత్తే యహ సత్తే అరె సత్తే యహ సత్తే ఓసత్తే అహ సత్తే
ఏ సత్తే ఏగొడవ లేదు సత్తే ఏగోల లేదు
పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
ఏ కలకాలం కాకుల్లాగ గడిపేస్తె ఏమొస్తుంది
హంసల్లె దర్జాగుండాలోయ్
ఏయ్ అందమైన ఈ జీవితానికో అర్థం వెతకాలోయ్
కోటి మందిలొ పోటుగాడిలా నువ్వే బతకాలోయ్
ఏ సత్తే ఏగొడవ లేదు సత్తే ఏగోల లేదు
పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
చెయ్యలి రోజుకో తప్పు అవ్వాలి నీకు కనువిప్పు
అరె చేసినతప్పే మళ్ళీ నువు చేస్తే తప్పు
ఏ తప్పు చెయ్యకపొతే అది ఇంకా తప్పు
మరి అంతానీకే తెలుసనుకోవటం పొరపాటవదా
నువు సేసే పనిలో ప్రాణం పెట్టి దూకై గురువా
ఉప్పొంగాలి ఉత్సాహం గుండెల్లో
నీదమ్మెంతో చూపించెయ్ అందర్లో
ఉరుమై ఆ మెరుపై పిడుగై నువ్వడుగై
ఏ సత్తే ఏగొడవ లేదు సత్తే ఏగోల లేదు
పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
ఏ కలకాలం కాకుల్లాగ గడిపేస్తె ఏమొస్తుంది
హంసల్లె దర్జాగుండాలోయ్
అరె అందమైనదీ లోకం అది చూడకుంటె నీలోపం
ఈ పగలు రేయి లేకుంటె రోజే అవదు
ఏకష్టం నష్టం రాకుంటె లైఫే అనరు
మరి అందరిలాగె నువ్వు ఉంటె రాదేసరదా
పదిమంది నడిచే దార్లో వెళితె బోరే అవద
పనిలేదంటే కొట్టేసె హస్కైనా
పనికొస్తుందా చేసేసై రిస్కైనా
గెలుపే నీ పిలుపై దొరలా నువు బతికై బతికై
ఏ సత్తే ఏగొడవ లేదు సత్తే ఏగోల లేదు
పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
ఓరి ఓరి ఓరి కలకాలం కాకుల్లాగ గడిపేస్తె ఏమొస్తుంది
హంసల్లె దర్జాగుండాలోయ్
- సత్తే యహ సత్తే అరె సత్తే యహ సత్తే ఓసత్తే అహ సత్తే
Desamuduru
Movie More SongsSatte E Godava Ledhu Keyword Tags
-
-
-