Manasuley
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Chakri
Lyrics
- మనసులే... కలిసెలే...
మౌనమే మౌనమే మనసులో మిగిలెనే
నిన్నిలా చేరగా మంచులా కరిగెనే
ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే
నిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటలే
మనసులే... కలిసెలే...
నీకోసం కలగన్నా కలలోన నినుకన్నా
ఏడబాటు ఎదురైనా నీ నీడై వస్తున్నా
ఎదలో... ఎదలో...
ఎదలో ఎపుడో అటుపైవలవేశావే
కలవో అలవో వలపై ముంచేశావే
ఈ ప్రేమమైకం ప్రవహించే లోన
నీ ఊహలదాహం శృతిమించే లోలోన
వేచి వేచి కలలే మిగిలే దాచి దాచి ఉంచా
చూసి చూసి వయసే రగిలే చేరిపంచుకుంటా
జతగా...జతగా...
ముద్దు ముద్దు ముద్దుచేసి
గుండెల్లోన చిరుమంటేసి
ముద్దు ముద్దు ముద్దుచేసి
గుండెల్లోన చిరుమంటేసి
ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే
నిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే
మదిలో... మదిలో...
మదిలో హృదిలో ఏదో చేసేశావే
వలపు తలపు నాలో నింపేశావే
విరహాల రాగం వినిపించే లోగా
నీ మోహావేశం లయ పెంచే లోలోన
బిగిసి బిగిసి క్షణమే యుగమై నన్ను చుట్టుకున్నా
ఎగసి ఎగసి నిషిలో శశినై నిన్ను చేరుకున్న
జతగా... జతగా...
మత్తు మత్తు మత్తు జల్లి
చిత్తు చిత్తు చిత్తు చేసి
మత్తు మత్తు మత్తు జల్లి
చిత్తు చిత్తు చిత్తు చేసి
ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే
నిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే
Desamuduru
Movie More SongsManasuley Keyword Tags
-
-