MovieGQ

Enduko

Chinthakayala Ravi (2008) · Track 5 of 6

Lyrics

ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో ఎన్నడూ తెలియంది ఎందుకో నాలో మొదలైంది ఎందుకో నేనే నాలాగ అస్సలు లేనెందుకో సొగసులకు ఈ రోజు బరువెందుకో నడకలకు ఈ రోజు పరుగెందుకో ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో రేపటికి ఈ రోజు ఉరుకెందుకో చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన చిరు తేనెలోన మునిగేందుకా ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో నేనే నాలాగ అస్సలు లేనెందుకో చరణం: 1 ఆ ఊరు ఈ ఊరు వేరైనా ఆకాశం అంతా ఒకటేగా ఆ నువ్వు ఈ నేను ఏడున్నా ఆలోచనలన్నీ ఒకటేగా ఊహలే పంపితే రాయబారం ఊసులే చేరవా వేగిరం ప్రేమలో చిన్నదే ఈ ప్రపంచం అని తెలిసి కూడ తెగ అలజడాయె ఆ త లపులోనే తలమునకలాయె మరి ఎందుకో చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా తన బాటలోన తన తోటలోన తన తోడులోన తన నీడలోన నడిచేందుకా చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా తన తనువులోన అణువణువులోన మధువనములోన ప్రతికణములోన కలిసేందుకా ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో సొగసులకు ఈ రోజు బరువెందుకో నడకలకు ఈ రోజు పరుగెందుకో ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో రేపటికి ఈ రోజు ఉరుకెందుకో చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chinthakayala Ravi

See All