Song Details
Lyrics
ప్రేమేనా... హొ... ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక మనసిచ్చా పూర్తిగ నా మనసునే అడగక నువ్వైనా నేనైనా అనుకోనిది నీలోన నాలోన జరిగే ఇది బాగుందే బాగుందే ఏదో బంధమే సాగిందే నీతో పాదమే బాగుందే బాగుందే ఏదో బంధమే ఊగిందే నీకై హృదయమే చరణం: 1 ద్వేషమే స్నేహమై కష్టమే ఇష్టమై దూరమే తీరమై భారమే తేలికై పంతాలే చిలిపిగ చదివిన పాఠాలై భేదాలే చివరికి కలిసిన భావాలై ఏనాడో చినుకల్లే మొదలైనది ఈనాడే వరదైన వరమే ఇది బాగుందే బాగుందే ఏదో బంధమే మోగిందే నాలో మౌనమే బాగుందే బాగుందే ఏదో బంధమే లాగిందే ఊహాలోకమే ప్రేమేనా... చరణం: 2 చూపులే చిత్రమై మాటలే మంత్రమై ఊపిరే ఊయలై నవ్వులే వెన్నెలై దేహాలే ప్రణయపు పూవుల దారాలై ప్రాణాలే మమతల మల్లెల హారాలై బ్రతుకంతా బ్రతికించే భావం ఇది ప్రతిరోజూ జన్మించే మార్గం ఇది బాగుందే బాగుందే ఏదో బంధమే నువ్వంటే నా ప్రతిబింబమే బాగుందే బాగుందే ఏదో బంధమే నీకేలే నా సగభాగమే ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక మనసిచ్చా పూర్తిగ నా మనసునే అడగక నువ్వైనా నేనైనా అనుకోనిది నీలోన నాలోన జరిగే ఇది బాగుందే...
Lyrics sourced from public databases. May contain errors.