MovieGQ

Regumullole

Chandamama (2007) · Track 1 of 6

Song Details

Lyrics

రేగుముళ్ళోలె నాటు సిన్నాది బొడ్డు మల్లెను సూడు అన్నది మీసాలు గుచ్చకుండా ఒరే బావో ముద్దాడుతావా అంది కంది పూవల్లె ముట్టుకుంటాను కందిరీగల్లె కుట్టిపోతాను కుచిళ్ళు జారకుండా ఒరే బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు నీ నడుముకెంత పొగరబ్బా అది కదులుతుంటే వడదెబ్బ నువు కెలకమాకు మనసబ్బా ఇక నిదుర రాదు నీయబ్బ మీసాలు గుచ్చకుండా... కోనేటి నీళ్ళల్లో వంగిందిరో కుండల్లే నా గుండె ముంచిందిరో తను తడిసిందిరో నను తడిపిందిరో ఆ పిట్ట గొడెక్కి నుంచుందిరో కొమ్మొంచి కాయేదో తెంపిందిరో అది జాంపండులా నను తింటుందిరో ఎదురే పడితే ఎదలో గుండు సూదల్లె దిగుతావురో తన కనులు గిలికి సింగారి తన జడను విసిరి వయ్యరి చిరు నగవు చిలికి ఒకసారి కొస పెదవి కొరికి ప్రతిసారి యహ మీసాలు గుచ్చకుండా ఒరే బావో ముద్దడతావా నువ్వు ఆ జొన్న చేలళ్లో పక్కందిరో ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో బులుపే తీరక కసి ఊరిందిరో ఓసారి నాతోనే సై అంటేరో దాసొహమౌతాను నూరెళ్ళురో ఇక తన కాళ్ళకే పసుపవుతానురో ఇదిగో పిల్లడో నువ్వు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో నీ నడుము పైన ఒక మడతై పై జనమలోన ఇక పుడతా అని చెలిమి చేరి మొర పెడితే తెగ కులుకులొలికె ఆ సిలక మీసాలు గుచ్చకుండా ఒసే భామ ముద్దాడలేనే నేను కంది పూవల్లె ముట్టుకుంటాను అహ కందిరీగల్లె కుట్టిపోతాను కుచిళ్ళు జారకుండా ఒరే బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు మీసాలు గుచ్చకుండా ఒరే బావో ముద్దాడుతావా అంది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chandamama

See All