MovieGQ

Bugge Bangaarama

Chandamama (2007) · Track 2 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

సాకీ: పచ్చిపాల యవ్వనాల గువ్వలాట పంచుకుంటే రాతిరంత జాతరంట పల్లవి: బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ పట్టుచీరల్లొ చందమామ ఏడు వన్నెల్లొ వెన్నెలమ్మ కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లొ ముద్దుగుమ్మ బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ చరణం: 1 ఎదురే నిలిచే అధర మధుర దరహాసం ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం వెలిగే అందం చెలికే సొంతం వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలో జరిగే విహారం పుష్యమాసాన మంచునీవో భోగిమంటల్లొ వేడి నీవో పూల గంధాల గాలినీవో పాల నురగల్లొ తీపి నీవో బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ నగమల్లి పూల తోడ నంజుకున్న ముద్దులాట సందెకాడ కొత్తగానే ఆరుబయట ఎన్నేలెంత సర్దుకున్న కన్నె జంట సర్దులాయెరో యో నారుమల్లి తోటకాడ నాయుడోరి ఎంకిపాట నగమల్లి పూల తోడ నంజుకున్న ముద్దులాట సందెకాడ కొత్తగానే ఆరుబయట ఎన్నేలెంత సర్దుకున్న కన్నె జంట సర్దులాయెరో చరణం: 2 ఎదలో జరిగే విరహ సెగల వనవాసం బదులే అడిగే మొదటి వలపు అభిషేకం వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో జతగా పిలిచే అగరు పొగల సహవాసం జడతో జగడం జరిగే సరసం ఎపుడో అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే అన్ని రంగుల్లో ఆమె రూపే అన్ని వేళల్లో ఆమె ధ్యాసే నన్ను మొత్తంగా మాయచేసే బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ పట్టుచీరల్లొ చందమామ ఏడు వన్నెల్లొ వెన్నెలమ్మ కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లొ ముద్దుగుమ్మ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chandamama

See All