Song Details
Lyrics
ఛెంగు ఛెంగు ఛెంగుమంటు తుళ్ళుతున్న తుంగభద్ర చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా ఘల్లు ఘల్లు ఘల్లుమన్న ఎడ్ల బండి జోరు చూసి ఏరువాక సాగుతుంటే చెంత చేరవా ఏయ్ ఎర్ర మిరప కన్ను ఆ ఎండ పొద్దుకు చుర్రు చుర్రంటూ గుచ్చే ఈ పల్లె బుగ్గకు కోలో కోయిల పాట ఈ కొమ్మ గొంతుకు ఏలో ఎన్నెల్లో ఊట ఆ కొండ కోనకు ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో చెంగు చెంగు చెంగుమంటూ తుళ్ళుతున్న తుంగభద్ర చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా నూనూగు మీసాల ఊరి పెద్దలం ఎవడెంతటోడైన మాది పెత్తనం పక్కవాడు ఏడిస్తే ప్రాణమిస్తాం బక్కవాడు కనిపిస్తే ఏడిపిస్తాం ఎన్నుపూస లేనోణ్ణి ఎండగడతాం ఎన్నపుస మనసుంటే ఎంట పడతాం కాడి పట్టి దున్నుతున్న బాలచంద్రులం ఆకలేసి అరిసినోళ్ళకన్నదాతలం హే చిట్టిగువ్వ రెక్క రంగు చీర కట్టుకున్నది ఉట్టిమీది ఎన్న లాగ ఊరిస్తా ఉన్నది కొబ్బరాకు పచ్చలాంటి కొంగు తిప్పుతున్నది జబ్బ చూసి నాటి నుంచే బెంగ పెట్టుకున్నది నా లేత తమలాపాక నా రాజా నిమ్మలపండా నా గున్న మామిడి మొగ్గా నాకున్న మాపటి దిక్కా ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో మేలుకోవే ఓ మనసా మేళుకోవే ఓ మనసా బొమ్మనే చేశాడు ప్రాణమే పోశాడు సిరులిచ్చి దీవించి చింతలే తీర్చాడు ఉన్ననాడే మేలుకొని ఉట్టికెక్కమన్నాడు ఊపిరాగిపోయిందా మట్టిపాలే వీడు మేలుకోవే ఓ మనసా మేలుకోవే ఒ మనసా ప్రాయమంతా పండగే చేశావు తల పండినాక తత్వమే చెబుతావు అనుభవించనివ్వు ఈ వైభోగం వయసు ఉడిగి పోయాకే వైరాగ్యం హే ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో ఛెంగు ఛెంగు ఛెంగుమంటు తుళ్ళుతున్న తుంగభద్ర చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా ఘల్లు ఘల్లు ఘల్లుమన్న ఎడ్ల బండి జోరు చూసి ఏరువాక సాగుతుంటే చెంత చేరవా
Lyrics sourced from public databases. May contain errors.