Song Details
Lyrics
హే సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య అరె సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య పెంచింది నన్ను మీ అభిమానము మీ తోడై ఉంటాను కలకాలము సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో హే సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య చరణం: 1 అన్నా తమ్ముళ్ళ ఈ అనుబంధమూ ఇలలో అందరికీ అది ఆదర్శము లోకం నాలోకం ఇక మీరేనురా ప్రాణం నా ప్రాణం మీ మీదేనురా వేళ్ళు ఒక్కటైతే అది ఉక్కు పిడికిలిరా అందరొకటైతే అది అగ్గిపిడుగేరా అభిమానం కురిపించే ఈ ఆంధ్రదేశం అంతా నాదే హే సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య చరణం: 2 మీరే నా కళ్ళు ఇక ఏ నాటికీ మీరే తమ్ముళ్ళు ఏజన్మకీ ఎపుడూ తీరని మీ ఋణమన్నదీ దైవం తెచ్చాడు ఈ వరమన్నదీ అన్న కన్నుల్లో వెలిగేటి దివ్వెలివి అన్న గుండెల్లో పూచేటి పువ్వులివి నామాటే వేధంగా నడిచేటి తమ్ముళ్ళంటే మీరే హొయ్ సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య పెంచింది నన్ను మీ అభిమానము మీ తోడై ఉంటాను కలకాలము సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో
Lyrics sourced from public databases. May contain errors.