MovieGQ

Rangulalo Kalavo

Abhinandana (1988) · Track 8 of 8

Song Details

Lyrics

పల్లవి: రంగులలో కలవో యద పొంగులలో కళవో రంగులలో కలవో యద పొంగులలో కళవో నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఊయలవో రంగులలో కలవో యద పొంగులలో కళవో చరణం: 1 కాశ్మీర నందన సుందరివో.. కాశ్మీర నందన సుందరివో కైలాస మందిర లాస్యానివో ఆమని పూచే యామినివో.. ఆమని పూచే యామినివో మధుని బాణమో.. మదుమాస గానమో నవ పరిమళాల పారిజాత సుమమో రంగులలో కలనై.. యద పొంగులలో కళనై నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊగించనా రంగులలో కలనై చరణం: 2 ముంతాజు అందాల తానివో.. ముంతాజు అందాల తానివో షాజాను అనురాగ సౌధానివో లైలా కన్నుల ప్రేయసివో.. లైలా కన్నుల ప్రేయసివో ప్రణయ దీపమో నా విరహ తాపమో నా చిత్రకళా చిత్ర చైత్ర రథమో రంగులలో కలనై యద పొంగులలో కళనై నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊరించనా రంగులలో కలనై యద పొంగులలో కళనై

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Abhinandana

See All