MovieGQ

Prema Entha Madhuram

Abhinandana (1988) · Track 6 of 8 · 4:09

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చరణం: 1 ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళని ఈ యదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చరణం: 2 నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Abhinandana

See All