O Sayonara Sayonara
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Sooraj Santhosh
Lyrics
- పల్లవి:
చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువు పలకని మాటలాగ నను మార్చమాకె సఖియా
హ చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువు చూడని చోటులాగ నను చేయమాకె సఖియా
అలై నువ్వే నను వీడినా వెనకే సంద్రం నేనై
ఇలా రానా నీ చుట్టూ నిలవన ప్రాణాలా వలై
ఓ... సయొనరా సయొనరా సయొనరా
సెలవంటు నా చెలిమికే విసరకే చీకటి తెర
చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువు పలకని మాటలాగ నను మార్చమాకె సఖియా
చరణం: 1
ఊఁ నీతో ఎన్నడూ వచ్చే నీడనై నిఘా నేనేగా
నువ్వు ఎప్పుడూ శ్వాసించే గాలినై నిఘా నేనేగా
ఓ... పువ్వులాగ నిన్ను చూడాలంటూ ముళ్లైపోతా
ముత్యంలాగ నిన్ను దాచే ఉప్పునీరైపోతా
ఆపదొచ్చి నిను గుచ్చుకుంటే
ఆపే మొదటి గాయం నేనే ఔతా
ఓ... సయొనరా సయొనరా సయొనరా
సెలవంటు నా చెలిమికే విసరకే చీకటి తెర
చరణం: 2
నిశ్శబ్దంలోన నీ గుండుచప్పుడై ఉంటా తోడుంటా
శబ్దాలెన్నున్నా నీ రెప్పలచప్పుడే వింటా నే వింటా
ఓ... చేదు కలలకు మేలకువలాగ వస్తా
బాధ మేలుకుంటే నిదరై కాపుకాస్తా
వేదనలికింకా వీడుకోలు పలికే చివరి కన్నీటి చుక్కైపోతా
ఓ... సయొనరా సయొనరా సయొనరా
సెలవంటు నా చెలిమికే విసరకే చీకటి తెర
1 Nenokkadine
Movie More SongsO Sayonara Sayonara Keyword Tags
-
-