MovieGQ

Ye Dikkuna Nuvvunna

Yuvasena (2004) · Track 6 of 6

Song Details

Lyrics

జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే (4) ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా... పొంగే అలవొస్తే తలవంచాలి వయసూ అలలాంటిదేగా ప్రాయం వెనకాలే పయనించాలి ప్రణయం వెన్నాడి రాగా జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే (2) సరిగరిసరి సరిగ సరిగ రిసరి సరిగ సరి సరిగమ (2) ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా... చరణం: 1 గిరులే వణికే జలపాతంలో జోరు నీలో చూశా బంగారూ ఎదిగే సొగసై ఎదురొస్తే పదహారు అలలై ఎగిసే ఎదహోరు వర్ణాల విల్లులో ఒక్కోరంగు తీసి వయ్యారి ఒంటికి పూసిందెవరు? మనసే చెడక నిలిచే నరవరులెవరు జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే (4) చరణం: 2 మధువే తొణికే అధరం మధుకలశం మౌనం కూడా ప్రియమంత్రం అపుడూ అపుడూ తెగిపడనీ ఒక ముత్యం వెనకే తిరిగా ప్రతినిత్యం ఆ చిలక పలుకులే అలా అలా ఏరి నాలోని తలపులే స్వరాలు చేసి నీకే ఇస్తా సఖియా కవితలు కూర్చి... జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే (4) ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా... పొంగే అలవొస్తే తలవంచాలి వయసూ అలలాంటిదేగా ప్రాయం వెనకాలే పయనించాలి ప్రణయం వెన్నాడి రాగా జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే (2) సరిగరిసరి సరిగ సరిగ రిసరి సరిగ సరి సరిగమ (2) ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yuvasena

See All