Song Details
Lyrics
ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే రాణీకాసులన్నీ కళ్ళనిండా రాలుతుంటే బల్లే బల్లే కానీ ఖర్చులేని అల్లరిట్టా తుళ్ళుతుంటే బల్లే బల్లే యే హ చాంద్ క టుక్ డా ఏదో చెయ్యవేంది పోరడా నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా మణులున్న గనిలాంటి నిగనిగల సిరి వగల కలవారి కామాక్షి నువ్వే కదా కలలంటి కళలన్నీ మా కళ్ళకిచ్చేసి నిరుపేద లోలాక్షివయ్యావుగా బట్టల్లో పొదుపంటే నాకిష్టం అందాలపై అదుపు అంతే కష్టం బొత్తాలు మానేసి లోకానికి చిన్నిమొత్తాల పొదుపంటే చూపావులే ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే యే హ చాంద్ క తుక్డా ఏదో చెయ్యవేంది పోరడా నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా తల్వారు తళుకుల్తో నిలువెల్లా కోస్తుంటే ఆ తీపిగాయాలు మానేదెలా జలతారు సొంపుల్తో జాదూలు చేస్తుంటే ఆ చిలిపి జాతర్ని ఆపేదెలా ఇన్నిన్ని అందాలు నా నేరమా జాలేసి చూపిస్తే నిష్ఠూరమా నీకున్న జనశక్తి సామాన్యమా నిన్ను చూశాక మతి చెడితే విడ్డూరమా ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే యే హ చాంద్ క తుక్డా ఏదో చెయ్యవేంది పోరడా నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా
Lyrics sourced from public databases. May contain errors.