Song Details
Lyrics
ఆ.. మైక్ ఉన్నదే పాట లేదు డప్పు ఉన్నదే బీటే లేదు స్పీకరున్నదే పెప్పే లేదూ స్టేజు ఉన్నదే స్టెప్పే లేదూ వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా పంచ్ ఉన్నదే కౌంటర్ లేదు సర్కిలున్నదే సెంటర్ లేదు ఈడు ఉన్నదే ఈలే లేదు బాడీ లోపల గోలే లేదు వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా హే రాగమున్నది రంభే లేదు రంగు ఉన్నది పొంగే లేదు బ్యాండ్ ఉన్నది సౌండే లేదు గ్యాంగ్ ఉన్నది బాంగే లేదు మేజువాని ఉన్నా ఏ జవాని లేదు వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా అరె వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా అయ్యో.. టీజర్ చూసి మోసపోయి సినిమాకెళ్లి బుక్కైనట్టు రేటింగ్ చూసి రెచ్చిపోయి డిన్నర్ కెళ్ళి లాకైనట్టు క్రేజ్ చూసి మోజుపడి చైనా ఫోన్ కి ఫూలైనట్టు ఆఫరుంటే ఆశపడి ఆన్లైన్ మని బ్లాకైనట్టు వెల్కమ్ పోస్టర్ ఉంది కాని పార్టీ ఊసే లేదు డిస్కో డాన్స్ ఉందీ కాని జ్యోతిలక్ష్మీ లేదూ గ్లామర్ బోలెడు ఉంది కాని ఓ గ్రామరంటు లేదు రాతిరి మొత్తం ఉంది జాతర జాగరమే లేదు వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా అరె వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా మ్మ మ్మ మ్మ మ్మ ఆ పండగేల తెచ్చుకున్న థౌసాండ్ వాలా తుస్సన్నట్టు కల్లు తాగి కోతిపిల్ల లోల్లే మరచి తొంగున్నట్టు పవర్ బాంక్ ఫుల్ గున్నా ఛార్జింగ్ కేబుల్ కట్టైనట్టు ఫ్రైడే రోజు పబ్బు ఉన్నా ట్రై డే అంటూ బోర్డెట్టినట్టు గ్రూపు ట్రూపు ఉంది ఊపులేమి లేవు బారు బీరు ఉంది ఏ జోరు లేనే లేదు మ్యాటర్ బోలెడు ఉంది ఓ మీటరంటు లేదు ప్రాణం పంచే స్నేహం ఉంది మనసే పంచే మార్గం లేదు వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా అమ్మ వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా మ్మ మ్మ మ్మ మ్మ వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా మ్మ మ్మ మ్మ మ్మ
Lyrics sourced from public databases. May contain errors.