Song Details
Lyrics
మల్లె పూల వాన మల్లె పూల వాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణా… భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా మల్లె పూల వాన.. జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా మల్లె పూల వాన.. వాన వాన వాన భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా దొరకును దొరకూనా ఎదురెవరుర మనకీ వేళలోన చరణం: 1 ఓయమ్మా ఈ రోజున వద్దనకమ్మా ఏం చేసినా నా పాదాలే పరుగులు తీసే గోదారి అలలవుతుంటే ఆగేనా ఎవ్వరాపినా అష్ట సిరులు నిను ఇష్టపడెనురా కష్టపడితే జత కట్టవచ్చురా గ్రహాలన్నీ మనకే అనుకూలిస్తున్నవి గనక మహారాజులాగా వేశానుర కోటలో పాగా పాచిక వేశాక పారక పోదురా నూరారు అయినా చరణం: 2 మబ్బుల్లో ఆ జాబిలి.. నా జత కోసం రావాలని ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నాడే నా జళ్లో చేరాలని ప్రేమ యాత్రలో పక్క దారులు ఎంత మాత్రము తప్పు కాదురా రథం నడుపుతారా మా మామను కూర్చోపెట్టి ఎటెళ్లాలో చెబుతా కళ్లాలను చేత్తో పట్టి అల్లుడినైపోగా చల్లగ నా కాళ్లు కడిగించుకోనా
Lyrics sourced from public databases. May contain errors.