MovieGQ

Jingilaalo Yem Gingiraalo

Vinodam (1996) · Track 1 of 5

Lyrics

జింగిలాలో ఏం గింగిరాలో బొంగరాలో ఈ భాంగ్రాలో లెఫ్టు రైటు లేదులో పడుచు బాటలో ఎర్ర లైటు వద్దురో కుర్ర జోరులో చిన్నారి ఈ చకోరి చూపింది చిలిపి దారి ఓరోరి బ్రహ్మచారి.. వదిలేస్తే వెరీ సారీ పారాహుషారు పాటలందుకో ఈ పరుగులో బ్రేకులెందుకో చరణం: 1 పాసుపోర్టు లేదు వీసాల గొడవ లేదు వయసు దూసుకెళితే దేశాల హద్దులేదు చాల్లేరా నెల్లూరే వెళ్లాలన్నా బస్ చార్జీ నిల్లేరా ఇల్లాగే ఫారిన్ టూరు వెళ్లేది ఎలారా యు.ఎస్ ని ప్యారిస్ ని ఊహల్లో చూడరా టెక్నికలర్ కలలు కనే టెక్నిక్ మనకుందిరా ఆ నింగికి సైతం నిచ్చెన వేద్దాం మన ఆశకున్న హార్సు పవర్ చూపిద్దాం ఏ ఎల్లలైన చెల్లవంటు చాటిద్దాం శాటిలైటు లాటిదిరా సాటిలేని యవ్వనం పూట పూట వినోదాలు చూపించే సాధనం జింగిలాలో ఏం గింగిరాలో బొంగరాలో ఈ భాంగ్రాలో చరణం: 2 ఫిల్మ్ స్టారులంతా మనకేసి చూస్తున్నారు మనం చూడకుంటే మరి ఎలా బతుకుతారు చల్ చల్ రే… పాకెట్లో పైసాలతో పిక్చర్కే పోయొద్దాం పోస్టర్లో పాపకి ఓ డ్రస్సు కొనిద్దాం తాపీగా కూర్చుంటే తోచదురా సోదరా హ్యాపీగా ఎగరడమే మనమెరిగిన విద్యరా ఆ గువ్వలమవుదాం.. రివ్వున పోదాం మేఘాల మీద సంతకాలు చేసేద్దాం ఓ వానవిల్లు కట్టి తిరిగి దిగి వద్దాం తుళ్లిపడే అల్లరితో గొల్లుమనే సంబరం ఆకలనీ దాహమని ఆగదురా ఏ క్షణం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vinodam

See All