Song Details
Lyrics
పల్లవి: హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల శుభలేఖలు రాసిన వేళ! చరణం: 1 ఎటు చూస్తున్నా శుభ శకునాలే కనపడుతున్నవి కదా ఎవరేమన్నా పెళ్లి మంత్రాలై వినపడుతున్నవి కదా ప్రేమా గీమా చాలించేసి పెళ్లాడేసే వేళయ్యింది ప్రేయసి కాస్తా పెళ్లామయ్యే ఆ సుముహూర్తం వచ్చేసింది కళ్యాణ వైభోగంతో కన్యాదానం కానీయబ్బాయి ఆ పైన నా ఓళ్లోనే కాలక్షేపం చెయ్యాలమ్మాయి… చిలకలా చరణం: 2 వరుడిని నేనై పరిణయమాడే పిల్లకి పల్లకి తేనా ఇదివరకెపుడు పరిచయమవని సిగ్గుకి దగ్గర కానా పిల్లామూక పరివారంతో చుట్టాలంతా వస్తారంట చిన్నా పెద్దా సకుటుబంగా చుట్టూ చేరి చూస్తారంట ఓ గాలి డివ్వి డివ్వి డివ్విట్టంతో డోలూ సన్నాయి మొగుడి వేషంలో నిన్నే చూసి నవ్వేస్తానోయి… కిల కిలా
Lyrics sourced from public databases. May contain errors.