Song Details
Lyrics
పల్లవి: మాటే మరచావే ... చిలకమ్మా మనసు విరిచావే అంతట నీవే కనిపించి అలజడి రేపావే కమాన్ ... క్లాప్ ... హల్లో మై రీటా ఏవయింది నీ మాట హల్లో మై రీటా ఏవయింది నీ మాట పాడేవు సరికొత్త పాటా మారింది నీ బాటా హల్లో మై రీటా ఏవయింది నీ మాట పాడేవు సరికొత్త పాటా మారింది నీ బాటా చరణం: 1 నీ పెదవులు చిలుకును మధురసం నీ హృదయం మాత్రం పాదరసం నీ పెదవులు చిలుకును మధురసం నీ హృదయం మాత్రం పాదరసం నాలో రేపావు జ్వాలా ఒకరితొ పాడేవు జోలా నను మరచిపోవడం న్యాయమా మనసమ్మినందుకు నమ్మినందుకు వలపు గుండెకే గాయమా కథలే మారెను కలలే మిగిలెను ... హే .. హల్లో మై రీటా ఏవయ్యింది నీ మాటా పాడేవు సరికొత్త పాటా మారింది నీ బాటా చరణం: 2 ప్రేమన్నది దేవుని కానుక అది నీకు కేవలం వేడుక ప్రేమన్నది దేవుని కానుక అది నీకు కేవలం వేడుక కృష్ణుడు ఆశ పడీ రాగా రాధిక వేరు పడీ పోగా ఎడబాటు సహించదు హృదయము ఒకనాటికైన నీ జీవితాన కనరాకపోవునా ఉదయము నిజమే తెలుసుకో గతమే తలచుకో .. హే హల్లో మై రీటా ఏవయింది నీ మాట హల్లో మై రీటా ఏవయింది నీ మాట పాడేవు సరికొత్త పాటా మారింది నీ బాటా మాటే మరచావే ... చిలకమ్మా మనసు విరిచావే
Lyrics sourced from public databases. May contain errors.