MovieGQ

Purushudu Nenai Puttali

Thene Manasulu (1965) · Track 7 of 8

Song Details

Lyrics

పురుషుడు నేనై పుట్టాలి ప్రకృతి నీవే రావాలి ఇరువురి మనసులు కలవాలి ఆ కలయిక కళకళలాడాలి పుడమే నేనై పుట్టాలి ఒడిదుడుకులను ఓర్వాలి కడలిని నదినీ కలపాలి ఆ కలయిక కళకళలాడాలి మెరమెరలాడే వయసు నేనై మిసమిసలాడే సొగసు నీవై వెల్లువలాగా వెన్నెలలాగా ముల్లోకాలను ముంచాలి పైమెరుగులకే పరవశమయ్యే పరువానికి పగ్గం వేసి పగ్గం కట్టిన కన్నె మనసులో లోతులు తెలిసి మసలాలి దేవుడు నేనై పుట్టాలి దేన్నో తాను ప్రేమించి ఆడదాని మనసంటేనే విషమని తెలిసి ఏడ్వాలి గాజు వంటి హృదయం తనది రాతి వంటి నాతికి తగిలి ముక్కలు చెక్కలుగా పగిలి నెత్తురు కన్నీరవ్వాలి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thene Manasulu

See All