MovieGQ

Eenade Babu Nee Puttina Roju

Thatha Manavadu (1973) · Track 3 of 6

Song Details

Lyrics

ఈనాడే బాబు నీ పుట్టినరోజు ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు ఈనాడే బాబు నీ పుట్టినరోజు చిన్నిబాబు ఎదిగితే కన్నవారికానందం నెలవంక పెరిగితే నింగికే ఒక అందం చుక్కలు వేయేందుకు ఒక్క చంద్రుడే చాలు చుక్కలు వేయేందుకు ఒక్క చంద్రుడే చాలు తనకోసం విలపించే తనయుడొక్కడు చాలు ఈనాడే బాబు నీ పుట్టినరోజు ఈ ఇంటికే... ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు ఈనాడే బాబు నీ పుట్టినరోజు కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి తనకు తాను సుఖపడితే తప్పుగాకున్న తనవారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న ఈనాడే బాబు నీ పుట్టినరోజు తండ్రిమాటకై అడవికి తరలిపోయె రాఘవుడు అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు తల్లి చరను విడిపించగ తలపడే ఆ గరుడుడు అందుకె ఆ పక్షి ఇంద్రుడు అంతటి మహనీయుడు ఓ బాబు నువ్వు ఆ బాట నడవాలి ఓ బాబు నువ్వు ఆ బాట నడవాలి భువిలోన నీ పేరు ధ్రువతారగ వెలగాలి ధ్రువతారగ వెలగాలి ఈనాడే బాబు నీ పుట్టినరోజు ఈ ఇంటికే... ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు ఈనాడే బాబు నీ పుట్టినరోజు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thatha Manavadu

See All