Song Details
Lyrics
పల్లవి: అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం చరణం: 1 ఎవరు తల్లి ఎవరు కొడుకు.. ఎందుకు ఆ తెగని ముడి? కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి ఎవరు తల్లి ఎవరు కొడుకు.. ఎందుకు ఆ తెగని ముడి? కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి కరిగే కొవ్వొత్తిపై.. కనికరం ఎవ్వడికీ.. ఎవ్వడికీ అది కాలుతున్నా వెలుగులే - కావాలి అందరికీ. . అందరికీ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం చరణం: 2 కొడుకంటూ నీకూ వొకడున్నాడూ - వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడూ నిన్ను కడసారైనా చూడరాలేదూ - వల్లకాటికైనా వస్తాడను ఆశలేదూ ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషనూ - ఏతల్లీ కనగూడదు ఇలాంటి కొడుకునూ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం చరణం: 3 కానివారి ముచ్చటకై.. కలవరించు మూఢునికీ కన్నవారి కడుపుకోత.. ఎన్నడైనా తెలిసేనా తారాజువ్వల వెలుగుల తలతిరిగిన వున్మాదికీ చితిమంటల చిటపటలు వినిపించేనా? . . చితిమంటల చిటపటలు వినిపించేనా? అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం
Lyrics sourced from public databases. May contain errors.