Song Details
Lyrics
పల్లవి: ఆ.. ఆ.. ఆ.. ఆ.. వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ వనమెల్ల వేచేనురా..... నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా... రావేలా... రావేలా చరణం: 1 కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని... కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని గున్న మావి పూయనన్నదీ నీవు రావని ఆ...... ఆ....... ఆ..... ఆ.. కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా కదలాడే యమునా నది... నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా రావేలా రావేలా చరణం: 2 మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని నా నీడ తానన్నదీ రాడు రాడేమని ఆ...... ఆ...... ఆ..... ఆ..... రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా రావేల... చిరుజల్లుగా నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా రావేలా రావేలా
Lyrics sourced from public databases. May contain errors.