MovieGQ

Radhalola Gopala

Sharada (1973) · Track 6 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: రాధాలోలా! గోపాలా!గాన విలోలా.. యదుబాలా నందకిషోరా! నవనీత చోరా! నందకిషోరా! నవనీత చోరా... బృందావన సంచార.. రాధాలోలా! గోపాల...గాన విలోలా.. యదుబాలా నీ గుడిలో గంటలు మోగినవి నా గుండెల మంటలు రేగినవి నీ గుడిలో గంటలు మోగినవి నా గుండెల మంటలు రేగినవి ఎన్నాళ్లు చేశాను ఆరాధనా.. ఎన్నాళ్లు చేశాను ఆరాధనా.. దాని ఫలితమా నాకీ ఆవేదనా రాధాలోలా! గోపాలా!గాన విలోలా.. యదుబాలా నందకిషోరా! నవనీత చోరా! నందకిషోరా! నవనీత చోరా... బృందావన సంచార.. రాధాలోలా! గోపాల...గాన విలోలా.. యదుబాలా చరణం: 1 మనిషిని చేసి..మనసెందుకిచ్చావు? ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు? మనిషిని చేసి..మనసెందుకిచ్చావు? ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు? మనసులు పెనవేసి.. మమతలు ముడివేసి మగువకు పతి మనసే.. కోవెలగా చేసి ఆ కోవెల తలుపులు మూశావా? ఆ కోవెల తలుపులు మూశావా? నువు హాయిగ కులుకుతు చూస్తున్నావా? నీ గుడిలో గంటలు మోగినవి నా గుండెల మంటలు రేగినవి చరణం: 2 నీ గుడిలో గంటలు మోగాలంటే... నీ మెడలో మాలలు నిలవాలంటే... నీ సన్నిధి దీపం వెలగాలంటే... నే నమ్మిన దైవం నీవే అయితే... నా గుండెల మంటలు ఆర్పాలి... నా స్వామి చెంతకు చేర్చాలి... రాధాలోలా! గోపాలా! గాన విలోలా.. యదుబాలా! రాధాలోలా! గోపాలా! గాన విలోలా.. యదుబాలా! రాధాలోలా.. గోపాలా.. గోపాలా.. గోపాలా..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sharada

See All