MovieGQ

Pasivado Emito

Seetaratnamgari Abbayi (1992) · Track 3 of 5

Lyrics

పసివాడో ఏమిటో ఆ పైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు వేధించే పంతాలు ఏమిటో వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో పసివాడో ఏమిటో ఆ పైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు తాళెరుగని తల్లోక్కరు తోడెరుగని మోడొక్కరు కొడుకుండి తండ్రవలేక సతులుండి పతి కాలేక తన తలరాతకు తలవంచి శిలలాగే బ్రతికే దొకరు బంధాలే సంకెళ్లు వేయగా బ్రతుకంతా చెరసాల లాగా మారగా పసివాడో ఏమిటో ఆ పైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు చేజేతులా ఏ ఒక్కరు ఏ నేరము చేసెరగరు తెలిసెవరూ దోషులు కారు ఫలితం మాత్రం మోశారు పరులంటూ ఎవరూ లేరు ఐనా అంతా పగవారు ఇకనైనా ఈ మంటలారునా ఇకనైనా ఈ జంట చెంత చేరునా పసివాడో ఏమిటో ఆ పైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు వేధించే పంతాలు ఏమిటో వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో పసివాడో ఏమిటో ఆ పైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు ఆ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Seetaratnamgari Abbayi

See All