MovieGQ

Na Mogude Brahmachari

Seetaratnamgari Abbayi (1992) · Track 4 of 5

Song Details

Lyrics

యాహూ... రంగమ్మత్తా, అనుసూయక్క సీతమ్మొదినా, చెల్లాయమ్మా ఇది విన్నారా ఏమిటే కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ కి పెళ్ళికాలేదు అలాగా ఐతే మా మనవరాల్నిచ్చి చేస్తాను మనవరాలికిచ్చి చేస్తావా పోనీ నువ్వే చేసుకోకూడదు మా ముసలోడొప్పుకోడెమోనే సిగ్గులేకపోతే సరి వాడు నా మొగుడూ నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి మూడేళ్ళ కిందటే ఈడొచ్చింది మూడేళ్ళ కిందటే ఈడొచ్చింది ముదురు బెండకాయ చూసి మూడొచ్చింది నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి సోదెమ్మా సోదెమ్మా ఎలా ఉంది మా జంట జంట అది ఇప్పపూల పంట ఐతే మా పెళ్ళేప్పుడంటా చెబుతాను చెబుతాను కంచి కామాక్షి మధుర మీనాక్షి బెజవాడ కనకదుర్గ మీన ఆన ఇనుకోయే కూనా నీ పక్కనున్న పోటుగాడే నిన్ను ఎదుక్కుంటా వచ్చిన ఏటగాడు ఈడే నీ మెడ్లో తాళి కడతడు నీ ఒళ్ళో తల పెడతడు నీ ఊపుకు పగ్గమేస్తడు ఉయ్యాలకి పాపనిస్తడు ఇది ఎరుకల సాని మాట యాహూ... ఒడ్డు చుస్తే పొడుగు నాకు తెలిసివచ్చింది బొడ్డు కింద చీరకట్టు అలిసిపోయింది వాడి చూపు కన్నే వయసు పోపు పెట్టింది రేపునైనా చేయ్యమంటూ రెచ్చగొట్టింది ఉలకడు అసలే పలకడు ఉలకడు అసలే పలకడు రవికుల తిలకుడు రవికే అడగడు నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి చారి గారు పూజారి గారు మేము చేసేసు కుంటున్నాము ఏమిటి లవ్వు అవ్వా నువ్వా లవ్వా అవునోయ్ చెవిలో పువ్వా పెట్టుమరి పెళ్లి ముహూర్తం పెడతా పెడతా చూసి మరీ పెడతా స్వస్తి శ్రీ ప్రజాపతి నామ ప్రజాపతి హలోపతి హోమియోపతి ఏమిటీ సుత్తి ముందు ఈ పతి సంగతి చెప్పు వస్తున్నా వస్తున్నా వైశాఖ మాసే శుక్లపక్షే ఏకాదశి నాటి రాత్రి తొమ్మిది ఘడియల పంతొమ్మిదివిఘడియలకు ఘడియా ఐతే వేసేసు కుంటాం వేసికుందురు గాని వేసికుందురు గాని వేసుకోవడానికి వేరే ముహూర్తం ఉంది ముహూర్తమా ములక్కాయ హ హ హ... ముహుర్తాలు చూసుకోవు ముద్దు ముచ్చట్లు మూడు ముళ్ళు కోరుకోవు మూతి చప్పట్లు అందమంతా అగ్గిమంట రాజుకుంటుంటే లగ్గమంటూ ఆపమాకు లవ్వు మీదుంటే జడవను అసలే విడువను జడవను అసలే విడువను పెళ్ళికి ముందే తొలిరేయంటా నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Seetaratnamgari Abbayi

See All