Song Details
Lyrics
హే... తౌబ తౌబ తౌబ తౌబ కో: తౌబ తౌబ తౌబ తౌబ తోడుగుంది దిల్ రూబా... కో: తోడుగుంది దిల్ రూబా ఊపుగా తనొక్క స్టెప్పేస్తే ఊరికే ఊరంత తిడతారే అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు శభాష్ అంటారె ఊర్వశి రంబ మేనక అంతా అచ్చం నీ టైపే వాళ్ళకో రూల్ వీళ్లకో రూల్ పెట్టమనడం తప్పుకాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే దాన్ని నాట్యం దీన్ని మేళం అంటు అనడం తప్పుకాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే చరణం: 1 హే... తౌబ తౌబ తౌబ తౌబ కో: తౌబ తౌబ తౌబ తౌబ బాటిలెత్తే అంది దాబా కో: బాటిలెత్తే అంది దాబా మత్తులో మజాలు చేస్తుంటే కుళ్ళుతో గింజేసు కుంటారే స్వర్గలోకంలో జనమంత సుర అనే సారాని ఏస్తారే ఇంద్రుడు అండ్ కంపనీ పగలు రాత్రి కొడతారే వాళ్ళకో రూల్ నీకు ఓ రూల్ పెట్టమనడం తప్పుకాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే హే వాడ్ని కింగ్ నిన్ను బొంగు అంటు అనడం తప్పు కాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే చరణం: 2 హే...తౌబ తౌబ తౌబ తౌబ కో: తౌబ తౌబ తౌబ తౌబ పేక నట్టా దాచకబ్బా... కో: పేక నట్టా దాచకబ్బా చేతిలో పేకున్న ప్రతి వోడ్ని చేతకానొడల్లే చూస్తారే తీసిపారేయొద్దు జూదాన్ని ధర్మరాజంతోడు ఆడాడే భారతం జూదం వల్లే మలుపే తిరిగి అదిరింది వాళ్ళకోరూల్ మనకి ఓరూల్ పెట్టమనడం తప్పుకాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే చుక్కకైనా ముక్కకైనా సంకెలేస్తే తప్పు కాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే చుక్కనైనా ముక్కనైనా ఇక్కడేస్తే తప్పు కాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే ఇక్కడేస్తే తప్పు కాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే ఇక్కడేస్తే తప్పు కాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే ఇక్కడేస్తే తప్పు కాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే కో: తప్పు తప్పే పెద్ద తప్పే కో: తప్పు తప్పే పెద్ద తప్పే
Lyrics sourced from public databases. May contain errors.