MovieGQ

O Pilla Shubhanalla

Sardaar Gabbar Singh (2016) · Track 2 of 6

Lyrics

ఓ పిల్లా శుభానళ్ళ వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నీ వల్ల హాల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవ్వాళా... నా ఖాకీ చొక్కాని రంగుల్లో ముంచావే నా లంగావోనికి చీరల్లే సిగ్గందించావే... ఓ పిల్లా శుభానళ్ళ వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నీ వల్ల హాల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవ్వాళా... చరణం: 1 నీ కళ్లలో మాయున్నది ఆచూపులో మందున్నది ఖైదిల అంతు చూసే నన్నే ఖైదిలా కూర్చోబెట్టేశావే నీ నవ్వులో మహిమున్నది గిలిగింతలే పెడుతుందది మౌనన్నే వాటేసే నాతోనే ఏదేదో మాటాడిస్తున్నాదే ఏ ఈత రనోడ్ని గోదాట్లో తోశావే మళ్ళీ మబ్బుల్లో తేల్చావే... ఓ పిల్లా శుభానళ్ళ వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నీ వల్ల హాల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవ్వాళా హా... చరణం: 2 మామూలుగా మొండోడిని ఏ మూలనో మంచోడిని హయ్యయ్యో ఇపుడీ రెండు కాక చంటోడ్నైపోయా నిను చూశాక నీనెప్పుడూ నా దానిని నాలా ఇలా నన్నుండని మార్చావో వచ్చేస్తా నీ దాకా నన్నైన నేను ఆపలేకా... నే కాల్చే తూటాలు పువ్వుల్లా పుట్టాయే నీ మెళ్ళో దండెయ్ మన్నాయే... ఓ పిల్లా శుభానళ్ళ వచ్చావే ఎండల్లో వెన్నెల్లా ఓ నీ వల్ల హాల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవ్వాళా..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sardaar Gabbar Singh

See All