Song Details
Lyrics
నెమలికి నేర్పిన నడకలివీ మురళికి అందని పలుకులివీ శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీలా నెమలికి నేర్పిన నడకలివీ మురళికి అందని పలుకులివీ శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీలా నెమలికి నేర్పిన నెమలికి నేర్పిన నడకలివీ కలహంసలకిచ్చిన పదగతులు ఇల కోయిల మెచ్చిన స్వరజతులు కలహంసలకిచ్చిన పదగతులూ ఇల కోయిల మెచ్చిన స్వరజతులూ ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు కలిసి మెలిసి కలలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన వల్ప శిల్ప మనిమేఖలను శకుంతలను నెమలికి నేర్పిన నడకలివీ చిరునవ్వులు అభినవ మల్లికలు సిరిమువ్వలు అభినయ గీతికలు చిరునవ్వులు అభినవ మల్లికలు సిరిమువ్వలు అభినయ గీతికలు నీలాల కన్నుల్లో తారకలు తారాడె చూపుల్లో చంద్రికలు నీలాల కన్నుల్లో తారకలు తారాడె చూపుల్లో చంద్రికలు కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవి వర్మ చిత్ర లేఖనా లేఖ సరస సౌందర్య రేఖను శశిరేఖను నెమలికి నేర్పిన నడకలివీ మురళికి అందని పలుకులివీ శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీలా నెమలికి నేర్పిన నడకలివీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Sapthapadhi
See AllOm Jaathavedasesu
S.P. Balasubrahmanyam, S. Janaki
Ayigiri Nandhini
S.P. Balasubrahmanyam
Akhilaandeswari
S.P. Balasubrahmanyam, P. Susheela
Govullu Thellana
S.P. Balasubrahmanyam, S. Janaki
Bhamane Satya Bhamane
S. Janaki
Ye Kulamu Needante
S.P. Balasubrahmanyam, S. Janaki
Marugelaraa
S. Janaki
Vrepalliya Yeda Jhalluna
S.P. Balasubrahmanyam, P. Susheela
Thaandavam (Music Bit)
-