MovieGQ

Premanu Panchina

Sambaram (2003) · Track 3 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ప్రేమను పంచిన ప్రేమను ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కొరదా ప్రతి హృదయం ప్రేమను పొందటమో వరం అది అంబరమంటిన సంబరం ప్రేమలో తేలుదాం ప్రతి నిమిషం ప్రేమలో ఈ లోకమే సాగే ప్రేమగా ప్రేమతో ఈ జీవితం ప్రేమించగా ప్రేమను పంచిన ప్రేమను ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కొరదా ప్రతి హృదయం పసి మదిలో ఏముందో ముందుగానే తెలిసుంటుంది అందుకనే ఆ దైవం జంటగానే నడిపిస్తుంది మూసి ఉన్న కళ్ళలో ఎన్ని ఆశలో భాష రాని గుండెలో ఎన్ని ఊసులో సిరివెన్నెలంటి ఈ స్నేహం గతజన్మలోని బహుమానం ఈ జంట చూసి పులకించిపోయి శతమానమంది లోకం ప్రేమను పంచిన ప్రేమను ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కొరదా ప్రతి హృదయం ఎవ్వరితో ఎవ్వరికో ప్రేమ రాత రాసుంటుంది ఆ మదికీ ఈ మదికీ బంధమేసి నడిపిస్తుంది గుప్పేడంత గుండెలో ప్రేమ అన్నది జ్ఞాపకాల ఊపిరై తాకుతుంటది ప్రేమించి చూడు ఒకసారి అది మార్చుతుంది నీ దారి ఈ ప్రేమలోన ఆకాశమంత సంతోషముంది లేరా ప్రేమను పంచిన ప్రేమను ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కొరదా ప్రతి హృదయం ప్రేమను పొందటమో వరం అది అంబరమంటిన సంబరం ప్రేమలో తేలుదాం ప్రతి నిమిషం ప్రేమలో ఈ లోకమే సాగే ప్రేమగా ప్రేమతో ఈ జీవితం ప్రేమించగా ప్రేమను పంచిన ప్రేమను ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కొరదా ప్రతి హృదయం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sambaram

See All