MovieGQ

Matrudevobhava

Pandurangadu (2008) · Track 9 of 15

Lyrics

మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను పితృదేవోభవ అన్న మాట విడిచాను నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా నాన్నా అమ్మా అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి నీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావని నీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమని బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని తెలియనైతి తల్లీ, ఎరుగనైతిని అమ్మా కడుపు తీపినే హేళన చేసిన జులాయిని కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందునని అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నా నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నను కరుణించొద్దు నాన్నా కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం మా ఆయువు పోసుకొని నీవు వర్ధిల్లు కలకాలం శతమానం భవతి శతాష్‌మాన్‌ భవతి (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pandurangadu

See All