Ammayi Nachesindhi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Rajesh
Lyrics
- అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది
ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యిందీ
వైశాఖ మొచ్చేసింది ఇవ్వాళ రేపో అంది
ఓ మంచి మూర్తం చూసి సిద్ధం కమ్మందీ
ఓ...ఓ...ఓ...
ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కధలో
మనువే కుదిరీ కునుకే చెదిరి
మురిపెం ముదిరి నా మనసు నిలవనందీ
కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది
ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యిందీ
చరణం: 1
ఈ గాలి రోజూలా వీస్తున్నా ఈ వేల వేరేలా వింటున్నా సన్నాయి రాగాలుగా
నావైపు రోజూలా చూస్తున్నా ఈనాడు ఏదోలా అవుతున్న నీ కన్ను ఏమన్నదో
ఓ...నా ఈడు ఏం విన్నదో
ఆశ పెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా
నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూ ఉంటే ఎట్టా
ఎన్నెన్నొ అంటించి ఉక్కిరి బిక్కిరి అవుతున్నా
కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది
ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యిందీ
చరణం: 2
ముత్యాల మేనాలే రప్పించి మేఘాల వీధుల్లో తిప్పించి ఊరేగనీ హాయిగా
అందాల హద్దుల్నే తప్పించి వందేళ్ళ కౌగిల్లే అందించీ ఊరించు ఆ వేడుక
ఓ... ఊహించనీ నన్నిలా
ఏంటి గిచ్చి గిచ్చి రెచ్చ గొట్టేలా నువ్వూ
ఇంత పిచ్చి పిచ్చి పిచ్చి పెంచేస్తొందే నువ్వూ హోయ్
కవ్వించి కరిగించి కరిగే వయసుని కాపాడు
కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది
ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యింది
ఓ...ఓ...ఓ...ఈ కబురు విన్న ఎదలో
ఎన్నెన్ని పొడుపు కధలో
మనువే కుదిరీ కునుకే చెదిరి
మురిపెం ముదిరి నా మనసు నిలవనంది
కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా
Nuvve Nuvve
Movie More SongsAmmayi Nachesindhi Keyword Tags
-
-