MovieGQ

Nuvve Nuvve

Nuvve Nuvve (2002) · Track 4 of 6

Song Details

Lyrics

ఏ చోట ఉన్నా... ఉన్నా ఉన్నా నీ వెంట లేన... లేన లేన సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా... నీ వెంట లేన సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే చరణం: 1 నేల వైపు చూసే నేరం చేశావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ భందిస్తుందా మల్లె పూవుని ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం ఇకనైనా చాలించమ్మా వేధించడం చెలిమై కురిసే సిరివెన్నెలవ క్షణమై కరిగే కలవా ఆ ఆ నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా చరణం: 2 వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా నాక్కూడ చోటేలేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా ఆ ఆ నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా... నీ వెంట లేన సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nuvve Nuvve

See All