Song Details
Lyrics
పల్లవి: గౌరీ శంకర శృంగం నరనారీ సంగమ రంగం ఇది నటనకు సోపానం కళలకు కళ్యాణం చరణం: 1 పాదపూజకై మందారమైనా నాద మధువుతో మంజీరమాయె దేవతార్చనకు ఏకీర్తనైనా జీవితాంతమి రస నర్తనాయె వాజ్జయమే వచనం ఆంగికమే భువనం ఆకాశాలలో తారలన్ని ఆహార్యాలుగా అందుకుంటూ కైలాసాల శిఖరాగ్రాలందు కైవల్యాలు చవిచూసే వేళలో చరణం: 2 పడమటెండల పారాణి తూలె సంధ్యారాగాలతో ఊసులాడె కొలనులు నిదరోవు కార్తీక వేళ కలువలలో తేనె గిలిగింతలాయె సకల కళా శిఖరం నర్తనమే మధురం కాశ్మీరాలలో పూల గంధం కేదారాలలో సస్యగీతం శివలాస్యాల శృంగారాలెన్నో అంగాంగాల విరబూసే వేళలో
Lyrics sourced from public databases. May contain errors.