Song Details
Lyrics
పల్లవి: ఈ పాదం ఇలలోన నాట్య వేదం ఈ పాదం నటరాజుకే ప్రమోదం కాల గమనాల గమకాల గ్రంధం ఈ పాదం ఇలలోన నాట్య వేదం ఈ పాదం నటరాజుకే ప్రమోదం... చరణం: 1 ఈ పాదమే మిన్నాగు తలకు అందం ఈ పాదమే ఆ నాటి బలికి అంతం తనలోని గంగమ్మ ఉప్పొంగగా శిలలోనీ ఆ గౌతమే పొంగగా... పాట పాటలో తను చరణమైన వేళా కావ్య గీతిలో తను పాదమైన వేళా గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసే... ఈ పాదం ఇలలోన నాట్య వేదం ఈ పాదం నటరాజుకే ప్రమోదం చరణం: 2 ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం ఈ పాదమే శ్రీ హస్త కమల మధుపం వాగ్గేయ సాహిత్య సంగీతమై త్యాగయ్య చిత్తాన శ్రీగంధమై ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై ఆ పాదమే వరదయ్య నాట్య పధమై తుంబుర వర నారద మునులూ జనులూ కొలిచే ఈ పాదం ఈ పాదం ఇలలోన నాట్య వేదం ఈ పాదం నటరాజుకే ప్రమోదం కాల గమనాల గమకాల గ్రంధం ఈ పాదం ఇలలోన నాట్య వేదం ఈ పాదం నటరాజుకే ప్రమోదం
Lyrics sourced from public databases. May contain errors.