Song Details
Lyrics
సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా లోకమే బానిసై చేయదా ఊడిగం శాశనం దాటడం సఖ్యమా నా పదగతిలో ఏ ప్రతి ఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా నిశ్చయం నిశ్చలం నిర్బయం నా హయాం హా చరణం: 1 కానిదేముంది నే కోరుకుంటే బూని సాధించుకోనా లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యను కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట నే మనసు పడితే ఏ కళలనైనా ఈ చిటిక కొడుతూ నే పిలవనా సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా అదరనీ బెదరనీ ప్రవుత్తి ఒదగనీ మదగజమే మహర్షి చరణం: 2 వేడితే లేడి ఒడి చేరుతుందా..వేట సాగాలి కాదా ఓడితే జాలి చూపేన కాలం..కాలరాసేసి పోదా అంతము సొంతము పంతమే వీడను మందలో పందిలా ఉండనే ఉండను భీరువల్లే పారిపోనూ..రేయి ఒళ్ళో దూరిపోను నే మొదలుపెడితే ఏ సమరమైనా నా కెదురుపడునా ఏ అపజయం సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా లోకమే బానిసై చేయదా ఊడిగం శాశనం దాటడం సఖ్యమా నా పదగతిలో ఏ ప్రతి ఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా
Lyrics sourced from public databases. May contain errors.