Song Details
Lyrics
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది ప్రాణమైన మూగగుండె రాగమిది మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది చరణం: 1 ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మా ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా ఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం నింగి నేలా కూడే వేళ నీకు నాకు దూరాలేలా అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది చరణం: 2 చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికా పాట ఎందుకమ్మా రేయంతా నవ్వేను వెన్నెలమ్మా నీరెండకా నవ్వు దేనికమ్మా రాగాల తీగల్లో వీణా నాదం కోరింది ప్రణయ వేదం వేసారు గుండెల్లో రేగే గాయం పాడింది మధుర గేయం ఆకాశాన తారా తీరం అంతే లేని ఎంతో దూరం మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది దూరమిది జత కూడనిది చూడనిది మది పాడనిది చెప్పరాని చిక్కుముడి వీడనిది మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
Lyrics sourced from public databases. May contain errors.