Song Details
Lyrics
పల్లవి: కోనలో సన్న జాజిమల్లి జాజిమల్లి మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి తేరులో అనురాగవల్లి రాగవల్లి కావ్యాలకే హో శ్రీకారమై హో కస్తూరి తాంబూలమీవే కోరుకో సన్న జాజిమల్లి జాజిమల్లి ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి చరణం: 1 మేని సోయగాలు ప్రేమ బంధనాలు మౌన స్వాగతాలు రాగ రంజితాలు సరసములో సమరములు సరసులకు సహజములు ప్రాభావాలలోన నవ శోభనాలు జాణ రాగదే రాగమై రాధవై కోరుకో సన్న జాజిమల్లి జాజిమల్లి ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి రాగాలనే హోయ్ బోయిలతో హోయ్ మేఘాల మేనల్లో రానా కోనలో సన్న జాజిమల్లి జాజిమల్లి మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి తేరులో అనురాగవల్లి రాగవల్లి చరణం: 2 కోయిలమ్మ రాగం కొండవాగు వేగం పారిజాత సారం ఏకమైన రూపం అధరముపై అరుణిమలు మధురిమకై మధనములు నందనాలలోన రసమందిరాలలోన హాయిగా సాగగ చేరగా కోనలో సన్న జాజిమల్లి జాజిమల్లి మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి తేరులో అనురాగవల్లి రాగవల్లి కావ్యాలకే హో శ్రీకారమై హో కస్తూరి తాంబూలమీవే కోరుకో సన్న జాజిమల్లి జాజిమల్లి ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి
Lyrics sourced from public databases. May contain errors.